- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐ ప్యాక్ ప్రాంగణంలో సోదాల వ్యవహారం.. ED పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ (I-PAC) ప్రాంగణంలో జరిగిన సోదాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress)కు చెందిన పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ (I-PAC) ప్రాంగణంలో జరిగిన సోదాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే, రెయిడ్స్‌ను అడ్డుకున్నారనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్, సీనియర్ పోలీసు అధికారులకు సుప్రీంకోర్టు గతంలోనే నోటీసులు జారీ చేసింది. తమ విధులకు ఆటంకం కలిగించారన్న ఈడీ ఫిర్యాదుపై సమాధానం ఇవ్వాలని కోరింది. అదేవిధంగా ఐ-ప్యాక్ (I-PAC) కార్యాలయంలో దర్యాప్తుకు వెళ్లిన ఈడీ అధికారులపై పశ్చిమ బెంగాల్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ED అధికారులపై ప్రస్తుతానికి ఎలాంటి పోలీసు చర్యలు తీసుకునే అవకాశం లేదు.
ఎవిడెన్స్ భద్రపరచాలని ఆదేశాలు..
ఐ-ప్యాక్ (I-PAC) కార్యాలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచాలని బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ ఫుటేజీ సోదాల సమయంలో అసలు ఏం జరిగిందనే అంశాన్ని నిర్ధారించడంలో కీలకం కానుంది. ఈ కేసును కోల్‌కతా హైకోర్టులోనే విచారించాలని బెంగాల్ ప్రభుత్వం చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ వివాదంలో రాజ్యాంగపరమైన కీలక అంశాలు ముడిపడి ఉన్నాయని, అందుకే తామే నేరుగా విచారణ చేపడుతున్నామని ధర్మాసనం ఇప్పటకే స్పష్టం చేసింది. కానీ, తాము చట్టబద్ధంగా సోదాలు నిర్వహిస్తుంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర యంత్రాంగం, పోలీసులు కలిసి తమను అడ్డుకున్నారని ఈడీ వాదిస్తోంది. మరో వైపు ఈడీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అందుకే చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం బదులిస్తోంది.






