థ్యాంక్యూ భారత్..బల్గేరియా అధ్యక్షుడి ట్వీట్: మోడీ రిప్లయ్ ఇదే

by Dishanational2 |
థ్యాంక్యూ భారత్..బల్గేరియా అధ్యక్షుడి ట్వీట్: మోడీ రిప్లయ్ ఇదే
X

దిశ, నేషనల్ బ్యూరో: సోమాలియా దొంగల చేతిలో హైజాక్‌కు గురైన బల్గేరియాకు చెందిన ఎంవీ రుయెన్ అనే వాణిజ్య నౌకను, అందులోని పౌరులను భారత నౌకాదళం రక్షించిన విషయం తెలిసిందే. దీంతో బల్గేరియా అధ్యక్షుడు రుమెన్ రాదేవ్ తమ నౌకను రక్షించినందుకు భారత ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘బల్గేరియన్ నౌక రుయెన్ గతేడాది డిసెంబర్‌లో హైజాక్‌కు గురైంది. దీంతో రెస్య్కూ ఆపరేషన్ చేపట్టి మా పౌరులను విజయవంతంగా రక్షించిన భారత నౌకాదళం, ప్రధాని మోడీకి ధన్యవాదాలు’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ రిప్లయ్ ఇచ్చారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో పైరసీ, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం కట్టుబడి ఉందని తెలిపారు. రుమెన్ రాదేవ్ సందేశాన్ని ప్రశంసిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతకుముందు బల్గేరియా ఉప ప్రధాని సైతం మోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, గతేడాది డిసెంబర్ 14న సోమాలియా సముద్రపు దొంగలు ఎంవీ రుయెన్ అనే నైకను హైజాక్ చేశారు. దీంతో తాజాగా ఆ నౌకను గుర్తించిన భారత నావికాదళం రెస్య్కూ ఆపరేషన్ చేపట్టి నౌకను సేఫ్ చేసింది. ఈ ఆపరేషన్‌కు ఇండియన్ నేవీ ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా, ఐఎన్‌ఎస్‌ సుభద్ర, సీ17 విమానాలను ఉపయోగించింది. సుమారు 40గంటల పాటు రెస్య్కూ ఆపరేషన్ నిర్వహించింది. ఈ క్రమంలో ఇండియన్ నేవీపై సముద్రపు దొంగలు కాల్పులు సైతం జరిపారు.


Next Story

Most Viewed