ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన దళపతి విజయ్

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-04 11:49:28  IST  )

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త శకం మొదలైంది. వెండితెరపై దళపతిగా ముద్ర వేసుకున్న జోసెఫ్ విజయ్, ఇప్పుడు రాజకీయ రంగంలోనూ తన సత్తా చాటారు.

ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన దళపతి విజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త శకం మొదలైంది. వెండితెరపై దళపతిగా ముద్ర వేసుకున్న జోసెఫ్ విజయ్, ఇప్పుడు రాజకీయ రంగంలోనూ తన సత్తా చాటారు. తన సొంత పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) తరపున తొలిసారి బరిలోకి దిగిన విజయ్, పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో విజయ్ తన సమీప ప్రత్యర్థి, డీఎంకే (DMK) అభ్యర్థులను మట్టికరిపించారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఆధిక్యంలో కొనసాగిన విజయ్, చివరికి 20 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

తొలి అడుగు..

రాజకీయాల్లోకి వచ్చిన మొదటి ఎన్నికల్లోనే విజయ్ శాసనసభకు ఎన్నికవ్వడం విశేషం. పెరంబూర్ నియోజకవర్గంలో యువ ఓటర్లు విజయ్‌కు బ్రహ్మరథం పట్టారు. దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకేల ఆధిపత్యానికి గండి కొడుతూ విజయ్ తన జైత్రయాత్రను ప్రారంభించారు. విజయ్ విజయం ఖరారు కావడంతో పెరంబూర్ వ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటున్నారు. పటాకులు కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ 'సీఎం విజయ్' అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలోనూ విజయ్ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో అటు కూడా గెలుపు ఖాయమని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత ఫలితాల సరళిని చూస్తుంటే తమిళనాడులో 'విజయ్ ఫ్యాక్టర్' ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తమిళనాడులో విజయ్ ప్రభంజనం... స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Next Story