- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో విజయ్ ప్రభంజనం... స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని పార్టీకి ప్రజలు అధిక మద్దతు తెలపడం మార్పు కోరికకు సంకేతమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఫలితాలపై ఆయన స్పందించారు...

దిశ, ఏపీ బ్యూరో: తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని పార్టీకి ప్రజలు అధిక మద్దతు తెలపడం మార్పు కోరికకు సంకేతమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఫలితాలపై ఆయన స్పందించారు. దేశవ్యాప్తంగా జరిగిన తాజా ఎన్నికల ఫలితాలు ఓటర్లలో బలమైన మార్పు ఆకాంక్షను ప్రతిబింబిస్తున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పాలన నచ్చితే ప్రజలు మళ్లీ గెలిపిస్తారని, నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే ఉదాహరణ అని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయాన్ని ఆయన అకుంఠిత దీక్షకు నిదర్శనంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కృషిని ప్రశంసించారు. బీజేపీ జాతీయ నాయకత్వం, అలాగే పశ్చిమ బెంగాల్ నేత సువేందు ఆధికారి పాత్రను కొనియాడారు. అస్సాంలో అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించి విజయాన్ని సాధించిన ముఖ్యమంత్రి హిమంతా బిస్వా శర్మకు అభినందనలు తెలిపారు. పుదుచ్చేరిలో ఎన్‌డీఏ కూటమి విజయానికి నాయకత్వం వహించిన ముఖ్యమంత్రి రంగస్వామికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ విజయం సాధించడాన్ని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అన్ని పార్టీల నాయకులు, అభ్యర్థులకు అభినందనలు చెబుతున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు.






