రోడ్డు ప్రమాదంలో ఉద్యోగిని మృతి

by Taduka Kalyani |

రోడ్డు ప్రమాదంలో ఉద్యోగి మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి, బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద పక్వాన్ గ్రాండ్ రెస్టారెంట్‌కు ఎదురుగా జరిగింది.

రోడ్డు ప్రమాదంలో ఉద్యోగిని మృతి
X

దిశ, శేరిలింగంపల్లి : రోడ్డు ప్రమాదంలో ఉద్యోగి మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి, బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద పక్వాన్ గ్రాండ్ రెస్టారెంట్‌కు ఎదురుగా జరిగింది. చింతల నరేష్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు. ఎన్‌టిటి డేటా వెల్స్ ఫార్గో ఉద్యోగి అయిన తలారి కళ్యాణి (30) టీవీఎస్ జూపిటర్ వాహనంపై భర్త చింతల నరేష్ తో కలిసి వెళ్తుండగా యూ-టర్న్ తీసుకుంటున్న సమయంలో ఏపీ26బీఎల్4554 నంబరు గల ఇన్నోవా కారు వెనుక వైపు నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం వెనుక భాగంలో కూర్చున్న కళ్యాణి ఎగిరి కింద పడ్డారు. హుటాహుటిన ఆసుపత్రి తరలిస్తుండగా మృతి చెందారు.

Next Story