- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు సీఎంగా తలపతి విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్!
తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. 108 స్థానాలు సాధించిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న టీవీకే (TVK) అధినేత విజయ్, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇవాళ లోక్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో జరిగిన భేటీ అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, అందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. భేటీ సందర్భంగా గవర్నర్ కొన్ని కీలక సందేహాలను లేవనెత్తారు. మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువగా ఉన్న 113 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని గవర్నర్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి మరేదైనా పార్టీ మద్దతు ఇస్తుందా? మరియు ఈ 113 మందితో స్థిరమైన ప్రభుత్వాన్ని నడపడం సాధ్యమేనా? అని అడిగారు. సీఎం పదవి చేపట్టిన తర్వాత అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోగలనని ఏ ప్రాతిపదికన నమ్ముతున్నారని గవర్నర్ ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా, తమకు తగినంత సంఖ్యా బలం ఉందని, అవసరమైన మద్దతును ఇప్పటికే కూడగట్టుకున్నామని విజయ్ వివరించారు. విజయ్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ అనుమతిని మంజూరు చేశారు.
పిఠాపురం టీడీపీలో సంచలనం.. ఇన్‌చార్జ్ పదవి నుంచి SVSN వర్మకు ఉద్వాసన
సంఖ్యా బలం ఉంది.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వండి: గవర్నర్‌ను రిక్వెస్ట్ చేసిన విజయ్






