పిఠాపురం టీడీపీలో సంచలనం.. ఇన్‌చార్జ్ పదవి నుంచి SVSN వర్మకు ఉద్వాసన

by Naga Rani Yarlagadda |

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పిఠాపురం ఇన్చార్జ్ గా SVSN వర్మకు అధిష్టానం షాకిచ్చింది.

పిఠాపురం టీడీపీలో సంచలనం.. ఇన్‌చార్జ్ పదవి నుంచి SVSN వర్మకు ఉద్వాసన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా నియోజకవర్గ ఇంచార్జ్‌గా కొనసాగుతున్న ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు, కార్యకర్తలను సమన్వయం చేసేందుకు వీలుగా ఓ ప్రత్యేక కమిటీని పార్టీ నియమించింది. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయనుంది. కూటమి రాజకీయాల నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన టీడీపీ నాయకత్వం, క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు తగ్గకుండా ఉండేందుకే ఈ వినూత్న మార్పులు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల నియోజకవర్గ పరిధిలో ప్రొటోకాల్ ప్ర‌కారం.. ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుని వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చంద్ర‌బాబు చ‌ర్చించి.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.

Next Story