- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా వీర్యం వాడుకోండి : టెలిగ్రామ్ సీఈవో సంచలన ప్రకటన
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ ఆసక్తికర వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ ఆసక్తికర వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. 37 ఏళ్ల లోపు మహిళలు తన వీర్యాన్ని ఉపయోగించి ఐవీఎఫ్ చేయించుకుంటే, ఆ ఖర్చులను తానే భరిస్తానని ఆయన ఆఫర్ చేసారు. రష్యా రాజధాని మాస్కోలోని ఒక క్లినిక్‌లో దురోవ్ వీర్యం గతంలో దానం చేసిన స్పెర్మ్‌ను ఫ్రీజ్ చేసి ఇప్పటికీ వినియోగిస్తున్నారని సమాచారం. చాలా సంవత్సరాల క్రితమే తాను స్పెర్మ్ డొనేషన్ ఆపేశానని, అయితే అప్పట్లో ఆరోగ్యకరమైన వీర్యకణాలు దానం చేసే వారు తక్కువగా ఉన్నారని ఓ డాక్టర్ చెప్పడంతో సంతానం లేని దంపతులకు సహాయం చేయాలనే సామాజిక బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకున్నానని దురోవ్ గతంలో వెల్లడించారు.
తన వీర్యదానంతో గత 15 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో సుమారు 100 మంది పిల్లలు జన్మించారని, వారికి తన సంపదను సమానంగా పంచుతానని కూడా ప్రకటించారు. గత రిలేషన్‌షిప్స్ కారణంగా తనకు ఆరుగురు సంతానం ఉన్నట్లు వెల్లడించిన దురోవ్, ప్రస్తుతం తన సంపద 14 నుంచి 17 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని, ఆస్తినంతా తన పిల్లలందరికీ సమానంగా పంచుతానని వీలునామాలో పేర్కొన్నట్లు తెలిపారు.
Related news : అమెజాన్ వెబ్ సర్వీసులు డౌన్.. డౌన్ డిటెక్టర్‌లో 4 వేలకు పైగా రిపోర్టులు






