అమెజాన్ వెబ్ సర్వీసులు డౌన్.. డౌన్‌ డిటెక్టర్‌లో 4 వేలకు పైగా రిపోర్టులు

by Kema Shiva Kumar |

క్రిస్మస్ పర్వదినం వేళ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)లో ఏర్పడిన పెద్ద ఆటంకం వల్ల అనేక ఆన్‌లైన్ గేమింగ్ సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

అమెజాన్ వెబ్ సర్వీసులు డౌన్.. డౌన్‌ డిటెక్టర్‌లో 4 వేలకు పైగా రిపోర్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: క్రిస్మస్ పర్వదినం వేళ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)లో ఏర్పడిన పెద్ద ఆటంకం వల్ల అనేక ఆన్‌లైన్ గేమింగ్ సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఫోర్ట్‌నైట్, రాకెట్ లీగ్, ARC రైడర్స్, ఫాల్ గైస్ వంటి ఎపిక్ గేమ్స్ టైటిల్స్‌తో పాటు ఇతర ఆటలు కూడా లాగిన్ సమస్యలు, మ్యాచ్‌మేకింగ్ లోపాలు, సర్వర్ కనెక్షన్ ఎర్రర్లను ఎదుర్కొంటున్నాయి. డౌన్‌డిటెక్టర్ ప్రకారం అమెరికాలో AWSకి సంబంధించి 4,000 మందికి పైగా యూజర్లు కంప్లయింట్‌ను రైజ్ చేశారు. ARC రైడర్స్ గేమ్‌కు మాత్రం దాదాపు 35 వేలకు పైగా రిపోర్టులు వచ్చాయి.

కాగా, వెబ్ సర్వీస్ డౌన్ అవ్వడం వల్ల ఫోర్ట్‌నైట్‌లో లాగిన్ ఫెయిల్యూర్స్, సర్వర్స్ నాట్ రెస్పాండింగ్ ఎర్రర్లు, ఎపిక్ గేమ్స్ స్టోర్‌లో కొనుగోళ్ల సమస్యలు తలెత్తాయి. ఇక రాకెట్ లీగ్‌లో ఎపిక్ ఆన్‌లైన్ సర్వీసెస్ (EOS) టైమ్‌అవుట్‌ల వల్ల మ్యాచ్‌లలో యూజర్లు చేరలేకపోయారు. డెడ్ బై డేలైట్, అమాంగ్ అస్, అపెక్స్ లెజెండ్స్, VR చాట్ వంటి సర్వీసులు పాక్షికంగా పని చేశాయి. ప్లే స్టేషన్ నెట్‌వర్క్, స్టీమ్ కూడా స్తంభించిపోయాయి. అయితే, గతంలో కూడా అమెజాన్ వెబ్ సర్వీసులలో ఆటంకాలు ఏర్పడ్డాయి. కానీ, పండగ రోజుల స్నేహితులతో కలిసి ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడాలని ఆశించిన గేమింగ్ లవర్స్‌కు మాత్రం నిరాశే ఎదురైంది.

Next Story