Supreme Court: 35 ఏళ్ల సుదీర్ఘ జాప్యం.. పోలీసు అధికారిపై క్రిమినల్ కేసు కొట్టివేత

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-30 08:44:17  IST  )

విచారణలో 35 ఏళ్ల సుదీర్ఘ జాప్యం జరిగిన కారణంగా ఓ పోలీసు అధికారిపై ఉన్న క్రిమినల్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Supreme Court: 35 ఏళ్ల సుదీర్ఘ జాప్యం.. పోలీసు అధికారిపై క్రిమినల్ కేసు కొట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: న్యాయ విచారణలో జరిగే అసాధారణ జాప్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పను వెలువరించింది. ఏకంగా 35 ఏళ్ల పాటు విచారణ పెండింగ్‌లో ఉన్న ఓ క్రిమినల్ కేసును అత్యున్నత న్యాయస్థానం చివరకు కొట్టివేస్తున్నట్లుగా ప్రకటించింది. త్వరితగతిన విచారణ (Speedy Trial) అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్-21 ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు అని, సంబంధిత కేసులో ఆ హక్కు తీవ్రంగా ఉల్లంఘించబడిందని కోర్టు స్పష్టం చేసింది.

ధర్మాసనం కీలక వ్యాఖ్యలు..

ఓ పోలీసు అధికారిపై దశాబ్దాల క్రితం నమోదైన ఈ కేసు విచారణ వివిధ కారణాల వల్ల 35 ఏళ్లుగా సాగుతూనే ఉంది. దీనిపై సదరు అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా ఈ సుదీర్ఘ కాలంలో నిందితుడు ఎదుర్కొన్న మానసిక ఆందోళన, వ్యక్తిగత ఇబ్బందులను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణలో దశాబ్దాల తరబడి జాప్యం జరగడం వల్ల నిందితుడికి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా హక్కుకు భంగం కలిగిందని జస్టిస్ విక్రమ్ నాథ్ (Justice Vikram Nath), జస్టిస్ సతీష్ చంద్ర శర్మ (Justice Satish Chandra Sharma)లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. కేసు విచారణ ఆలస్యం కావడానికి నిందితుడు ఎక్కడా కారణం కాలేదని, ప్రాసిక్యూషన్ వైఫల్యం వల్లే ఈ జాప్యం జరిగిందని కోర్టు గుర్తించింది. ఇన్నేళ్ల తర్వాత విచారణ కొనసాగించినా సరైన సాక్ష్యాధారాలు లభించడం కష్టమని, సాక్షుల జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుందని కోర్టు పేర్కొంది. ఓ వ్యక్తిని దశాబ్దాల పాటు కోర్టుల చుట్టూ తిప్పడం తగదని పేర్కొంటూ, సదరు పోలీసు అధికారిపై ఉన్న అన్ని క్రిమినల్ చర్యలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

పవన్ ఖేరా ముందస్తు బెయిల్‌పై విచారణ.. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

Next Story