- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ ఖేరా ముందస్తు బెయిల్‌పై విచారణ.. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
పవన్ ఖేరా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ భాగంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి.

దిశ, వెబ్‌డెస్క్: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sharma)పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన పరువు నష్టం, ఫోర్జరీ కేసులో కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా (Pawan Khera) దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ పూర్తి చేసింది. తనకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ గౌహతి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై అసత్య ఆరోపణలు చేశారంటూ పవన్ ఖేరాపై అస్సాంలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన గతంలో గౌహతి హైకోర్టును ఆశ్రయించారు. అయితే, గౌహతి హైకోర్టు ఆయన విన్నపాన్ని తోసిపుచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ పవన్ ఖేరా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
కాగా, విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పును వాయిదా వేసింది. ఈ తీర్పు వెలువడే వరకు పవన్ ఖేరాకు అరెస్టు ముప్పు నుంచి ఊరట దక్కుతుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.






