- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అత్యాచార బాధితుల గర్భవిచ్ఛిన్నంపై కొత్త చట్టం తెండి: సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిన్నంపై కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అత్యాచార కేసుల్లో బాధితులు గర్భం దాల్చితే ఏ సమయంలోనైనా దాన్ని తొలగించుకునేలా కొత్త చట్టం తీసుకురావాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. అత్యాచారానికి గురైన 15 ఏళ్ల బాలిక 31 వారాల గర్భాన్ని తొలగించేందుకు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎయిమ్స్ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యాచారం తర్వాత ఆ బాలిక అనుభవించిన వేదనను ఏదీ భర్తీ చేయలేదని తమ శరీరాలపై నియంత్రణ కోసం మహిళలు చేస్తున్న పోరాటంలో ఒక కీలక మలుపు కాగల తరుణంలో, ఈ కేసులో ఆ బాలిక, ఆమె కుటుంబం యొక్క వ్యక్తిగత ఎంపికలను ప్రభుత్వం గౌరవించాలని కోర్టు పేర్కొంది.
పౌరులను గౌరవం ఇవ్వండి:
ఇటీవల ఈ కేసులో 31 వారాల గర్భం విచ్ఛిన్నానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ దశలో గర్భవిచ్ఛిత్తి చేస్తే బాలిక ఆరోగ్యంపై సుదీర్ఘకాలంలో ప్రభావం పడే అవకాశం ఉందని ఎయిమ్స్ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‍పై ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని ఉద్దేశించి చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడం.. పౌరులకు గౌరవం ఇవ్వండి. కోర్టు ఇచ్చిన గర్భవిచ్ఛిన్న ఉత్తర్వులను సవాలు చేసే అధికారం మీకు లేదు. బాధితురాలు లేదా ఆమె కుటుంబం మాత్రమే దీనిని సవాలు చేయగలరు అని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. మేము వ్యక్తుల ఎంపికలను గౌరవిస్తామని మీరు కూడా అలాగే చేయాలని జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ పేర్కొన్నారు.






