- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఆందోళన.. 'పీఎం మోడీ సరెండర్' అంటూ నినాదాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఐదవరోజు ప్రారంభం అయ్యాయి. సభలో ముందుగా 2025 డిసెంబర్ 24న మృతి చెందిన సురూప్‌సింగ్ హిర్యా నాయక్ మృతిపట్ల స్పీకర్ ఓం బిర్లా సంతాపం ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఐదవరోజు ప్రారంభం అయ్యాయి. సభలో ముందుగా 2025 డిసెంబర్ 24న మృతి చెందిన సురూప్‌సింగ్ హిర్యా నాయక్ మృతిపట్ల స్పీకర్ ఓం బిర్లా సంతాపం ప్రకటించారు. అనంతరం పీఎం మోడీ సరెండర్ అంటూ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు. నినాదాలు చేస్తూనే స్పీకర్ సెల్ లోకి దూసుకెళ్లారు. అమెరికా ట్రేడ్ డీల్ పై ప్రధాని తక్షణమే ప్రకటన చేయాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ జైరాం రమేష్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ మే 10, 2025న చేసినట్టుగానే అమెరికాకు పూర్తిగా లొంగిపోయారని తెలుస్తోందన్నారు.
ఆయన ఖచ్చితంగా ట్రంప్ ను శాంతిపంజేశారని ఆరోపించారు. ఈ దురదృష్టకర సంఘటనలు పునరావృతవం అవుతుండటంతో భారత్ దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు. దీనికి బధులిస్తూ సభ ఛైర్మన్ రాధాకృష్ణన్ ఈ విషయాన్ని తరవాత చర్చిస్తామని చెప్పారు. మరోవైపు సోమవారం ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, 2020 భారత్-చైనా వివాదంపై మాజీ ఆర్మీ చీఫ్ నరవణే ప్రచురించిన ఆటో బయోగ్రఫీలోని అంశాలను లేవనెత్తగా గందరగోళం నెలకొంది. దీనిపై రోజు సైతం ఆందోళనలు మొదలయ్యాయి. వరుస ఆందోళనల నేపథ్యంలో సభను ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాయిదా వేశారు.






