- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. రాజ్యసభలో జేపీ నడ్డా కీలక ప్రకటన
గత 9 నెలలుగా నెలకొన్న వివాదానికి తెరదించుతూ సోమవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎక్స్ వేదిక సంచలన ప్రకటన చేశారు.

దిశ, వెబ్ డెస్క్: గత 9 నెలలుగా నెలకొన్న వివాదానికి తెరదించుతూ సోమవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎక్స్ వేదిక సంచలన ప్రకటన చేశారు. భారత్-అమెరికా మధ్య ట్రేడ్ ఒప్పందం కుదిరిందని, భారత్ నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై 18 శాతం టారిఫ్స్ మాత్రమే విదిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో భారత, అమెరికా వ్యాపార వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని నింపగా.. భారత పార్లమెంట్‌లో మాత్రం ప్రతిపక్షాల నిరసనకు దారి తీసింది.
భారత్- అమెరికా మధ్య కుదిరిన చారిత్రక వాణిజ్య ఒప్పందంపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, రాజ్యసభ పక్ష నేత జేపీ నడ్డా రాజ్యసభ వేదికగా స్పందించారు. ఈ ఒప్పందానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఉభయ సభల్లోనూ సుమోటో (Suo motu) ప్రకటన చేయడమే కాకుండా, దానిపై సమగ్ర చర్చకు కూడా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
ట్రంప్ - మోదీ మధ్య స్నేహబంధం
సోమవారం సాయంత్రం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాల తగ్గింపు గురించి, ప్రధాని మోడీని తన 'నిజమైన మిత్రుడు' (True friend) అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లను నడ్డా ప్రస్తావించారు. దీనికి ప్రతిస్పందనగా ప్రధాని మోడీ కూడా ట్రంప్‌కు ధన్యవాదాలు తెలుపుతూ, వాణిజ్య సంబంధాల బలోపేతం పై ట్వీట్ చేశారని ఆయన సభకు వివరించారు.
ప్రతిపక్షాల తీరుపై మండిపాటు
ప్రభుత్వం అన్ని వివరాలను బహిర్గతం చేయడానికి, చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్, ఇండి (INDI) కూటమి సభ్యులు సభలో ఆందోళన చేయడం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా జేపీ నడ్డా విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు వారి నిరాశ (Frustration) ను ప్రతిబింబిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఒప్పందంలోని ప్రతి చిన్న అంశాన్ని ప్రభుత్వం నేడు సభ ముందు ఉంచుతుందని, కాబట్టి ప్రతిపక్షాలు సహకరించాలని ఆయన కోరారు.






