మద్రాస్ హైకోర్టులో విజయ్ సర్కారుకు షాక్.. కరూర్ తొక్కిసలాట బాధితుల ఉద్యోగాల జీవో రద్దు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-27 13:10:05  IST  )

కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మద్రాస్ హైకోర్టు ఎవరూ ఊహించని ఆదేశాలు జారీ చేసింది.

మద్రాస్ హైకోర్టులో విజయ్ సర్కారుకు షాక్.. కరూర్ తొక్కిసలాట బాధితుల ఉద్యోగాల జీవో రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: దళపతి విజయ్ (Vijay) నేతృత్వంలోని తమిళనాడు టీవీకే ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు (Madras High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ పొలిటికల్ ర్యాలీ తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ.. తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసింది. అయితే, కరూర్ ఘటన బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఇవాళ విచారించిన కోర్టు సీఎం విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లదని తీర్పునిచ్చింది. ప్రమాదాలు, తొక్కిసలాటలు జరిగినప్పుడు ఆర్థిక సాయం, పరిహారం అందించవచ్చని, కానీ నిబంధనలకు విరుద్ధంగా నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు కేటాయించడం సరైన విధానం కాదని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలను స్టేట్ సర్వీస్ కమిషన్ ద్వారా కేవలం అర్హతలు ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేస్తూ, బాధితులకు ఇచ్చిన నియామక ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లుగా ఆదేశాలు జారీ చేసింది.

రాజకీయాల్లోకి ధనుష్!.. రజనీకాంత్ వదిలేసిన ఆధ్యాత్మిక రాజకీయాన్ని కొనసాగించబోతున్నారా?

Next Story