అరుణాచలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. మోక్షమార్గంలోకి వాళ్లకు నో ఎంట్రీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-27 13:27:29  IST  )

మోక్ష మార్గానికి సంబంధించి అరుణాచల ఆలయ అధికారులు కొత్త రూల్స్ తీసుకొచ్చారు.

అరుణాచలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. మోక్షమార్గంలోకి వాళ్లకు నో ఎంట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలం (Arunachalam) గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న ప్రముఖ ఇడుక్కు పిళ్లైయార్ (Idukku Pillaiyar) ఆలయంలోని మోక్షమార్గానికి సంబంధించి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాతి బండల గుండా వెళ్లే ఈ అత్యంత ఇరుకైన మార్గంలో ప్రమాదాలను నివారించేందుకు భక్తుల ప్రవేశంపై ఆంక్షలు విధిస్తూ కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చారు.

అయితే, ఇడుక్కు పిళ్లైయార్ ఆలయంలో రెండు రాతి బండల మధ్య ఉన్న అత్యంత చిన్న సందు నుంచి దూరి వెళ్లడాన్ని భక్తులు ‘మోక్ష మార్గం’గా భావిస్తారు. ఇలా వెళ్తే చేసిన పాపాలు తొలగిపోతాయని, ఆరోగ్యం మెరుగుపడుతుందని భక్తుల నమ్మకం. కానీ, తాజాగా ఆలయ అధికారులు అధిక బరువు ఉన్నవారు, వృద్ధులు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇందులో ప్రవేశించవద్దని స్పష్టం చేశారు. ఇటీవల కొందరు భక్తులు మధ్యలోనే ఇరుక్కుపోవడం, శ్వాస తీసుకోవడం కష్టమై అస్వస్థతకు గురికావడం వంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతోనే భక్తుల రక్షణ దృష్ట్యా ఈ ఆంక్షలు విధించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. సాధారణ దర్శనం కోసం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం లేనప్పటికీ, రాతి బండల మధ్య నుంచి వెళ్లే ‘మోక్ష మార్గం’ ఎంట్రీ ప్రవేశం విషయంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఇక నుంచి కఠినంగా వ్యవహరించనున్నారు.

Next Story