- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
17వ వార్డు కౌన్సిలర్ కృష్ణా నాయక్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి..!
17వ వార్డు కౌన్సిలర్ కృష్ణా నాయక్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని 17వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కంటెస్టెడ్ కౌన్సిలర్ కడమంచి ఆనంద్, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

దిశ, చేవెళ్ల: 17వ వార్డు కౌన్సిలర్ కృష్ణా నాయక్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని 17వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కంటెస్టెడ్ కౌన్సిలర్ కడమంచి ఆనంద్, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం చేవెళ్లలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా వ్యవహరించాల్సిన వ్యక్తి సమాజం సిగ్గుపడేలా ప్రవర్తించారని ఆరోపించారు. ఆసుపత్రిలో అర్థరాత్రి మద్యం సేవించి కృష్ణా నాయక్ చేసిన హల్‌చల్ ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇచ్చినట్లవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తికి పార్టీ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కళ్లు తెరవాలని సూచించారు.
కౌన్సిలర్ కృష్ణా నాయక్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి బేషరతుగా తొలగించాలని డిమాండ్ చేశారు. చట్టం ఎవరినీ ఉపేక్షించదని, ఆయన పై చట్టపరంగా కూడా పోలీసులు కేసు నమోదు చేయాలని కోరారు. రాజ్యాంగబద్ధంగా ప్రజాప్రతినిధిగా ఎన్నికై, ప్రజల పట్ల, సమాజం పట్ల అనుచితంగా వ్యవహరించినందున కృష్ణా నాయక్‌ను కౌన్సిలర్ పదవి నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో పాటు జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు నాయకులు వెల్లడించారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడంతో పాటు చేవెళ్ల మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.






