- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైడ్రా హైదరాబాద్ ప్రజలకు అవసరం.. ఎంపీ చామల కిరణ్ కీలక వ్యాఖ్యలు
హైడ్రా అనేది హైదరాబాద్ ప్రజలకు అవసరమని, అనేక చెరువులు, కుంటలు, నాళాలను కబ్జాల నుంచి హైడ్రా కాపాడిందని భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : హైడ్రా అనేది హైదరాబాద్ ప్రజలకు అవసరమని, అనేక చెరువులు, కుంటలు, నాళాలను కబ్జాల నుంచి హైడ్రా కాపాడిందని భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లేఅవుట్, పార్కులు, రోడ్లు కబ్జాలను హైడ్రా పరిరక్షించిందని, హైదరాబాద్ నగరంలో మున్సిపల్, పోలీస్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం హైడ్రాతో సాధ్యం అయిందని ఎంపీ చామల చెప్పారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు విచ్చలవిడిగా కబ్జాలు చేసి పేద, మధ్య తరగతి వారికి ప్లాట్లు, అపార్ట్మెంట్స్ అమ్మారని, దీంతో తెలియక మోసపోయి కొన్నవారు 1 నుంచి 2 శాతం మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. దాదాపు లక్షన్నర కోట్లపై చిలుకు ప్రభుత్వ ఆస్తులను హైడ్రా కాపాడిందని, హైదరాబాద్ నగర భవిష్యత్ కోసం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారన్నారు. హైదరాబాద్ నగర ప్రజలు, సామాజిక వేత్తలు, ఎన్జీఓ సంస్థలు ముందుకు వచ్చి హైడ్రా వలన హైదరాబాద్ నగరానికి జరిగే మేలును తెలియచేయాలని ఎంపీ చామల పిలుపునిచ్చారు.
కేంద్ర హోంమంత్రి క్షమాపణలు చెప్పాలి
సీజేపీ నిరసనల్లో విద్యార్థులపై జరిగిన అమానుష దాడికి కేంద్ర హోమ్ మంత్రి క్షమాపణలు చెప్పాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యులైన పోలీసుల అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో అంతా అయిపోయిందని చేతులు దులుపుకుంటే ఉపేక్షించేది లేదని, పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాలంటే ప్రభుత్వం భాధ్యతతో వ్యవహరించాలని ఎంపీ చామల స్పష్టం చేశారు.






