ఓ దివ్యాంగుడి కోరికను తీర్చిన మల్కాజిగిరి సీపీ సుమతి..

by Batti.Sumithra |

అంగవైకల్యంతో బాధపడుతున్న ఓ బాలుడు పోలీసు అధికారి కావాలన్న కోరికను తీర్చి మల్కాజిగిరి పోలీసు కమిషనర్ సుమతి అతనిలో సంతోషాన్ని నింపారు.

ఓ దివ్యాంగుడి కోరికను తీర్చిన మల్కాజిగిరి సీపీ సుమతి..
X

దిశ, సిటీ క్రైమ్ : అంగవైకల్యంతో బాధపడుతున్న ఓ బాలుడు పోలీసు అధికారి కావాలన్న కోరికను తీర్చి మల్కాజిగిరి పోలీసు కమిషనర్ సుమతి అతనిలో సంతోషాన్ని నింపారు. పోలీసు క్యాప్‌ను ధరించిన ఆ బాలుడితో స్వయంగా ఫొటో దిగిన సీపీ సుమతి, ఆ కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని నింపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కందుకూరు గ్రామానికి చెందిన తిరుమలరావు, రాధమ్మ దంపతులు వలస వచ్చి హైదరాబాద్‌లోని దమ్మాయిగూడలో నివాసం ఉంటున్నారు.

వారికి దివ్యాంగుడైన కుమారుడు రాహూల్ ఉన్నాడు. అతనికి పోలీసు ఆఫీసర్ కావాలనే కోరిక ఉండడంతో ఈ విషయాన్ని తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమితి, ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ రష్మిత ద్వారా బాలుడి పోలీసు ఆఫీసర్ కావాలన్న కోరికను సీపీ సుమతి దృష్టికి తీసుకువచ్చారు. సీపీ సుమతి బాలుడి కోరికను తీర్చేందుకు అంగీకరించడంతో సోమవారం నేరేడ్‌మెట్‌లోని సీపీ కార్యాలయానికి రాహూల్‌ను తీసుకువచ్చారు. సీపీ స్వయంగా బాలుడిని పోలీసు కమిషనర్ కుర్చీలో కూర్చోబెట్టి, "నీవు పోలీసు అయ్యావు" అంటూ ఆప్యాయంగా పలకరించారు. పోలీసు క్యాప్ ధరించిన రాహూల్ ఆనందంలో మునిగిపోయాడు. అతని కుటుంబ సభ్యులు కూడా సీపీ సుమతి తమ కుమారుడి కలను నెరవేర్చారని సంతోషం వ్యక్తం చేశారు.

Next Story