మానవ తప్పిదంతోనే 1443 రోడ్డు ప్రమాదాలు..

by Batti.Sumithra |

మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది మొదటి ఆరు నెలలో మొత్తం 1788 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

మానవ తప్పిదంతోనే 1443 రోడ్డు ప్రమాదాలు..
X

దిశ, సిటీక్రైం : మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది మొదటి ఆరు నెలలో మొత్తం 1788 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో 171 మంది మ్రుతి చెందగా 1588 మంది గాయపడ్డారు. మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ రోడ్డు సేఫ్టీ అథారిటీ విభాగం, ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన రివ్యూ లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చోటు చేసుకున్న ఈ రోడ్డు ప్రమాదాల్లో 1443 రోడ్డు ప్రమాదాలు కేవలం మానవ తప్పిదం వల్లే జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది. మరో 345 రోడ్డు ప్రమాదాలు. వివిధ రకాల రోడ్డు ఇంజినీరింగ్ లోపాలతో జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

అయితే మానవ తప్పిదం వల్ల చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ముఖ్యంగా ఏడు తప్పిదాలను పోలీసులు గుర్తించారు. వాటిల్లో 1)ఓవర్ స్పీడింగ్, 2)రాంగ్ రూటు డ్రైవింగ్, 3)డ్రంకన్ డ్రైవింగ్, 4) సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రైవింగ్ లో ఫోన్ ను ఉపయోగించడం, 5)అక్రమ పార్కింగ్, 6)సిగ్నల్ జంపింగ్, 7)ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ తో కూడిన తప్పిదాలు ఉన్నాయి. ఇలా వాహనదారులు వారి తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడి గాయాలకు గురవుతుండడంతో పాటు పలు సందర్భాల్లో ప్రాణాలను పోగొట్టుకున్నారని పోలీసుల విశ్లేషణలో తెలిసింది. ఈ మానవ తప్పిదాల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాలతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్ధిక కష్టాలతో పాటు మానసిక వేదనకు గురవుతున్నారు.ఈ నేపధ్యంలోనే రోడ్ల పై సురక్షిత ప్రయాణం కోసం పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు.

ద్విచక్రవాహనదారులు కచ్చితంగా ప్రయాణం సమయంలో హెల్మెట్ ను ధరించాలి.

కారు ప్రయాణంలో అందరూ సీటు బెల్టును పెట్టుకోవాలి.

అతి వేగంతో ప్రయాణించొద్దు.

డ్రైవింగ్ సమయంలో మొబైల్ ను వాడొద్దు.

రాంగ్ రూటులో అసలు ప్రయాణీంచొద్దు.

ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటించాలి.

ట్రాఫిక్ పోలీసులకు సహాకరించి, నిబంధనలను పాటించి రోడ్డు భద్రతను పెంచాలని పోలీసులు కోరుతున్నారు.

Next Story