- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎంసీ అధికారిక లోగో రూపకల్పన పోటీకి ఆహ్వానం
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ హైదరాబాద్ సంయుక్తంగా సీఎంసీ అధికారిక లోగో రూపకల్పన పోటీకి ఎంట్రీలను ఆహ్వానిస్తోంది.

దిశ, శేరిలింగంపల్లి : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ హైదరాబాద్ సంయుక్తంగా సీఎంసీ అధికారిక లోగో రూపకల్పన పోటీకి ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. ఈ పోటీలో విద్యార్థులు, ఆర్కిటెక్టులు, గ్రాఫిక్ డిజైనర్లు, విజువల్ ఆర్టిస్టులు, సృజనాత్మక రంగానికి చెందిన నిపుణులు పాల్గొనవచ్చు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అధికారిక గుర్తింపుగా నిలిచే లోగో రూపకల్పనలో భాగస్వాములు కావాలని కోరారు. రూపొందించే లోగోలో సుపరిపాలన, సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణ, సమ్మిళిత అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల భాగస్వామ్యం వంటి విలువలు ప్రతిబింబించేలా ఉండటంతో పాటు భవిష్యత్‌కు సిద్ధమైన సైబరాబాద్ దృక్పథాన్ని ఆవిష్కరించేలా ఉండాలని నిర్వాహకులు సూచించారు.
లోగో పూర్తిగా సహజ సిద్ధంగా రూపకల్పనగా ఉండాలి. ఏఐ, ఇపీఎస్, ఎస్వీజీ వెక్టర్ ఫార్మాట్‌కు ప్రాధాన్యత ఇవ్వరు. అధిక నాణ్యత గల పీఎన్జీ, జెపీఈజీ ఫైల్‌తో పాటు, గరిష్ఠంగా 250 పదాలలో డిజైన్ ఆవశ్యకతను వివరిస్తూ సమర్పించాలి. ఒక్కో అభ్యర్థి ఒక్క ఎంట్రీ మాత్రమే సమర్పించాలి. కాపీరైట్ ఉల్లంఘన లేదా AI ద్వారా నకలు చేసిన డిజైన్లు పరిగణనలోకి తీసుకోబడవు. లోగో డిజిటల్ ప్రింట్ వినియోగానికి అనువుగా ఉండాలి. విజేతలకు ప్రథమ బహుమతి : రూ.20,000, ద్వితీయ బహుమతి: రూ.15,000, తృతీయ బహుమతి రూ.10,000 అందజేస్తారు. ఎంట్రీల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 5 అనంతరం వచ్చిన ఇంటర్వ్యూ పరిగణించరు. జ్యూరీ నిర్ణయం అంతిమం. ఆగస్టు 10 న విజేతలను ప్రకటిస్తారు. ఎంపికైన అధికారిక లోగోను 15 ఆగస్టు ఆవిష్కరిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ప్రకటనలో ఇవ్వబడిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ ఎంట్రీలను ఆన్‌లైన్‌లో సమర్పించాలి.






