- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజావాణికి స్పందన కరువు
by Batti.Sumithra |
శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని వివిధ సర్కిళ్లలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.

X
దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని వివిధ సర్కిళ్లలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అయితే శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం, నార్సింగి, పటాన్‌చెరు సర్కిల్ పరిధిలో నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి స్పందన కరువైంది. మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లలో టౌన్ ప్లానింగ్ విభాగానికి రెండు చొప్పున ఫిర్యాదులు అందగా, అమీన్‌పూర్ సర్కిల్‌లో ఇంజినీరింగ్ విభాగానికి రెండు ఫిర్యాదులు వచ్చాయి. మొత్తం ఐదు సర్కిళ్లలో కలిపి కేవలం ఆరు ఫిర్యాదులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలను వినిపించేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడం పట్ల అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






