గ్రీవెన్స్ డేలో బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలి

by Taduka Kalyani |

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి సోమవారం నిర్వహించే ‘గ్రీవెన్స్ డే’ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రజల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు.

గ్రీవెన్స్ డేలో బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలి
X

దిశ, జగిత్యాల టౌన్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి సోమవారం నిర్వహించే ‘గ్రీవెన్స్ డే’ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రజల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 24 మంది అర్జీదారుల సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బాధితులు సమర్పించిన పత్రాలను పరిశీలించి, చట్ట పరిధిలో ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా, త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ... ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పోలీసు సేవలను అందించేందుకు జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

Next Story