- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ స్టేషన్‌లో ద్వంద్వ ప్రమాణాలా..?
కామారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, కామారెడ్డి: కామారెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం లో అధికార కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య ప్రజలు ఫిర్యాదు కోసం స్టేషన్‌కు వస్తే ఫోన్లు బయట పెట్టాలని గద్దించే పోలీసులు, అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు రీల్స్ చేస్తున్నప్పుడు ఎలా అనుమతిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
బాధితుడికి ఒక నియమం, నేతకు మరొకటా?
ఫిర్యాదు కోసం వచ్చే సామాన్యుడు కన్నీళ్లతో స్టేషన్ మెట్లెక్కితే "ఫోన్ బయట పెట్టిరా" అంటూ గద్దించే తీరు కనిపిస్తోందని, కానీ అదే స్టేషన్‌లో అధికార పార్టీ నేతలు వీడియోలు తీసి, రీల్స్ చేస్తుంటే పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవున్నాయి. "పేద ప్రజలకు ఒక న్యాయం, అధికారం ఉందని విర్రవీగే కార్యకర్తలకు, నాయకులకు మరొక న్యాయమా?" అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోలీస్ స్టేషన్ అనేది ప్రభుత్వ కార్యాలయం కాబట్టి అందరికీ ఒకే రకమైన నిబంధనలు ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వీడియోలపై సోషల్ మీడియాలో చర్చ
పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత పోలీస్ స్టేషన్ లోపల వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, లేదంటే పోలీసులపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి, పోలీస్ స్టేషన్లలో అమలయ్యే నిబంధనలపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.






