- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ ఎస్ఎస్ 2025 కౌన్సెలింగ్ ఆలస్యం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఫైమా
నీట్ సూపర్ స్పెషాలిటీ (NEET SS-2025) కౌన్సెలింగ్‌లో నెలకొన్న తీవ్ర జాప్యంపై ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: నీట్ సూపర్ స్పెషాలిటీ (NEET SS-2025) కౌన్సెలింగ్‌లో నెలకొన్న తీవ్ర జాప్యంపై ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత ఐదు నెలలుగా కౌన్సెలింగ్ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో వేలాది మంది అర్హత సాధించిన యువ స్పెషలిస్ట్ వైద్యులు శిక్షణ, ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారని ఫైమా తన పిటిషన్‌లో పేర్కొంది. కౌన్సెలింగ్ ఆలస్యం కారణంగా వైద్యులు తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని ఫైమా ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో కొత్త పీజీ వైద్యులు అందుబాటులోకి రాకపోవడం వల్ల దేశవ్యాప్తంగా పలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, అత్యవసర చికిత్సలపై ప్రతికూల ప్రభావం పడుతోందని వెల్లడించింది.
ప్రజారోగ్యం, వేలాది మంది వైద్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని ఫైమా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనాథ్ దొబ్యాల, ఛైర్మన్ డాక్టర్ జైదీప్ కుమార్ చౌదరి సుప్రీంకోర్టును కోరారు. నీట్ ఎస్ఎస్-2025 కౌన్సెలింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, వైద్య రంగంలో నెలకొన్న అనిశ్చితికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు.






