- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి
ఎల్ నినో వాతావరణ పరిస్థితుల వల్ల రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

దిశ భూపాలపల్లి ప్రతినిధి : ఎల్ నినో వాతావరణ పరిస్థితుల వల్ల రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు మరియు తెలంగాణ రైతు విజ్ఞాన వేదిక శాస్త్రవేత్తలతో జిల్లా కలెక్టర్ ప్రత్యాన్మయ పంటల సాగుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువగా నమోదు అవుతున్న పరిస్థితుల దృష్ట్యా ఏర్పడే ప్రతికూల పరిస్థితులను రైతులకు సమగ్రంగా వివరించాలని ఆదేశించారు. ఏ రకమైన పంటలు వేయాలి, తక్కువ నీటితో ఎలాంటి పంటలలో యాజమాన్య పద్ధతులు పాటించాలనే అంశాలపై క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. తక్కువ నీటి అవసరమైన ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను, ఎరువులను సిద్ధంగా ఉంచాలని, వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులకు ఎప్పటికప్పుడు సకాలంలో సాంకేతిక సలహాలు, సూచనలు అందించడంలో రైతు విజ్ఞాన వేదిక శాస్త్రవేత్తలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి రోజు తనకు పంటల సాగు నివేదికలు అందచేయాలని ఆదేశించారు. పంట సాగు చాలా తక్కువ జరుగుతుందని అవగహన పెంచి సాగును పెంచాలని స్పష్టం చేశారు. ప్రజలు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని, నీటిని వృథా చేయకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి బాబు రావు, ఉద్యాన వన అధికారి తిరుపతి, తెలంగాణ రైతు విజ్ఞాన వేదిక శాస్త్ర వేత్త డా మదన్ మోహన్ రెడ్డి, వ్యవసాయ శాఖ భూపాలపల్లి, మహాదేవపూర్ ఏడీఏలు రమేష్, శ్రీ పాల్, అన్ని మండలాల మండల వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






