నో హీరోయిన్.. నో రొమాన్స్.. అల్లు అర్జున్‌తో లోకేష్ భారీ ప్లాన్

by Chukka Sudharani |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో AA23 రాబోతున్న విషయం తెలిసిందే.

నో హీరోయిన్.. నో రొమాన్స్.. అల్లు అర్జున్‌తో లోకేష్ భారీ ప్లాన్
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో AA23 రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ క్రేజీ సినిమాలో హీరోయిన్‌తో పాటు రొమాంటిక్ ట్రాక్ కూడా ఉండదని ఫిలిమ్ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ లోకేష్ ఈ మూవీని పూర్తిగా యాక్షన్ స్టోరీతో తెరకెక్కించనున్నట్లు టాక్. ఇందులో ప్రధానంగా యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కే ప్రాధాన్యం ఉండేలా ప్లాన్ చేస్తున్నారనే వార్తలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఒక స్టార్ హీరో సినిమా.. అందులోనూ కమర్షియల్ డైరెక్టర్ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ లేకపోవడం నిజంగా కొత్త విషయమేనని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అంతే కాకుండా.. ఖైదీ, విక్రమ్ సినిమాలను ఇలాగే తీశాడు లోకేష్. ఇప్పుడు బన్నీ సినిమాకీ అదే ఫార్ములా వాడుతున్నట్లు వైరల్ అవుతున్న ఈ వార్తలతో ఫ్యాన్స్‌లో AA23 పై క్యూరియాసిటీ పెరిగింది.

Next Story