వరస దొంగతనాలతో ప్రజలు బెంబేలు.. 7తులాల బంగారం, 32 తులాల వెండి మాయం

by Kodari Anjali |   (  Updated:2026-07-27 16:14:57  IST  )

తిరుమలాయపాలెం మండలంలోని వరస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

వరస దొంగతనాలతో ప్రజలు బెంబేలు..  7తులాల బంగారం, 32 తులాల వెండి మాయం
X

దిశ, తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండలంలోని వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పిండిప్రోలు, బీరోలు, బచ్చోడు గ్రామాల్లో జరిగిన వరుస చోరీలు మరువకముందే తాజాగా మండలంలో మరో చోరీ జరిగింది. అందుకు సంబంధించి బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కాకరవాయి గ్రామానికి చెందిన బూరగొమ్ముల సతీశ్-గౌతమి అనే దంపతులు గ్రామంలోని వారి ఇంటికి తాళం వేసి గత కొన్ని నెలలుగా ముగ్గురు పిల్లలతో కలిసి హైదరాబాద్ నగరంలో వాచ్ మాన్ డ్యూటీ చేస్తూ అక్కడే జీవనం సాగిస్తున్నారు. కాగా సోమవారం గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగిన కార్యానికి ఆదివారం సతీశ్ గ్రామానికి వచ్చాడు. ఆదివారం రాత్రి సతీశ్ అమ్మవాళ్ల ఇంట్లో పడుకుని, సోమవారం ఉదయం సతీశ్ తన ఇంటి వద్దకు వెళ్ళాడు. ఇంటి తలుపులు తీసి ఉండడం గమనించిన సతీశ్, ఇంట్లోకి వెళ్లి చూసేసరికి, రెండు బీరువాల తలుపులు తీసి,అందులోని 7తులాల బంగారం, 32 తులాల వెండి ఆభరణాలతోపాటు, లక్ష రూపాయల నగదు చోరీకి గురైనట్లు, వాటివిలువ సుమారు రూ.15లక్షల రూపాయల వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు. కాగా ఈ ఘటనకు సంబంధించి దిశ ఎస్సై కూచిపూడి జగదీశ్ ను వివరణ కోరగా.. ఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగిందని అన్నారు. క్లూస్ టీం ద్వారా పింగర్ ప్రింట్స్ సేకరించి, కేసు నమోదుచేసి పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

Next Story