నీట్ రద్దు చేయాలి.. పరీక్షల నిర్వహణ రాష్ట్రాలకే అప్పగించాలి: ఎమ్మెల్యే కూనంనేని

by Kodari Anjali |

దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిన నీట్ కుంభకోణానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు.

నీట్ రద్దు చేయాలి.. పరీక్షల నిర్వహణ రాష్ట్రాలకే అప్పగించాలి: ఎమ్మెల్యే కూనంనేని
X

దిశ, కొత్తగూడెం టౌన్: దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిన నీట్ కుంభకోణానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. నీట్ పేపర్ లీక్ ఘటనలో నష్టపోయి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నివాళులర్పిస్తూ సోమవారం సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెం రైల్వే స్టేషన్ సెంటర్ నుంచి ఓల్డ్ డిపో వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ, ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులు, యువజనులు సాగించిన ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలవంచాల్సి వచ్చిందన్నారు. నీట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి వైద్య విద్య ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని డిమాండ్ చేశారు. ఉద్యమ విరమణ సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని కోరారు. విద్యా వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నాలను ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా ప్రతిఘటించాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే నిర్ణయాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ర్యాలీలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story