జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం.. తీవ్ర ఆందోళనలో నందమూరి ఫ్యాన్స్

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-27 16:13:44  IST  )

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైంది.

జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం.. తీవ్ర ఆందోళనలో నందమూరి ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) భుజానికి గాయమైంది. ఇవాళ సాయంత్రం ప్రమాదవశాత్తు ఆయన భుజానికి గాయం కాగా, వైద్యులు ఆయనను పరీక్షించి 6 నుంచి 8 వారాల పాటు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లుగా ఎన్టీఆర్ వ్యక్తిగత టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, సాయంత్రం ఎన్టీఆర్ భుజానికి తీవ్రమైన గాయం కాగా.. గమనించిన సిబ్బంది ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని, అభిమానులు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు, వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు. ఆయన ఆరోగ్యం, కోలుకుంటున్న తీరుపై ఎప్పటికప్పుడు హెల్త్ అప్‌డేట్స్ తెలియజేస్తామని పేర్కొన్నారు.

అయితే, వైద్యుల సూచనల మేరకు ఎన్టీఆర్ తన రాబోయే చిత్రాల షూటింగ్‌లను తాత్కాలికంగా వాయిదా వేసుకోనున్నారు. తమ అభిమాన హీరో గాయపడ్డారనే వార్త తెలియడంతో యంగ్ టైగర్ అభిమానులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ‘గెట్ వెల్ సూన్’ అంటూ పోస్ట్ పెడుతున్నారు. మొన్నటికి మొన్న ఆయన బాబాయ్ నందమూరి బాలకృష్ణ కూడా ఓ మూవీ షూటింగ్‌లో యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Next Story