- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాండవుల గుట్ట సాక్షిగా ఖాకీల ఆపరేషన్..
మండలంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.బైక్‌లపై గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్న ఏడుగురు నిందితులను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

దిశ,డోర్నకల్: మండలంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.బైక్‌లపై గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్న ఏడుగురు నిందితులను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.గంజాయిని,వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.సీఐ చంద్రమౌళి కథనం ప్రకారం.. ద్విచక్ర వాహనాలపై గంజాయి సరఫరా జరుగుతున్నట్లు సమాచారం మేరకు ఈగల్ టీం,టాస్క్ ఫోర్స్,రెవిన్యూ సిబ్బందితో కలిసి ఎస్సై రియాజ్ పాషా ములకలపల్లి శివారులోని పాండవుల గుట్ట సమీపంలో మూడు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ పోలీసులను చూసి పారిపోవుటకు ప్రయత్నించగా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.ఒకరు తప్పించుకొనగా పట్టుబడిన బైకుల్లో 7.525 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు తెలిపారు.గంజాయి,ఇతర మత్తు పదార్థాల విక్రయాలు జరిపినా,రవాణా చేసినా కఠిన చర్యలు ఉంటాయని సీఐ చంద్రమౌళి హెచ్చరించారు.






