- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రహ్మగిరి (దోమలపెంట)లో పల్లె దవాఖాన ప్రారంభం
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం బ్రహ్మగిరి (దోమలపెంట) గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పల్లె దవాఖానను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.

దిశ, అమ్రాబాద్: నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం బ్రహ్మగిరి (దోమలపెంట) గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పల్లె దవాఖానను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ, దివ్యాంగులు, వృద్ధులు & ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న మహిళా సంఘం భవనానికి మంత్రి, ఎమ్మెల్యేలు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. నల్లమల ప్రాంత ప్రజలకు అందుబాటులోనే నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు తెలిపారు. పల్లె దవాఖానల ద్వారా గ్రామీణ ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






