‘చెట్టినాడు’ పరిశ్రమలో ఘోర ప్రమాదం: యువ కార్మికుడు స్పాట్ డెడ్

by Kema Shiva Kumar |

‘చెట్టినాడు’ పరిశ్రమలో ఘోర ప్రమాదం: యువ కార్మికుడు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: పరిశ్రమలో విధుల్లో ఉన్న కార్మికుడు దుర్మరణం పాలైన హృదయవిదారక ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు చెట్టినాడు పరిశ్రమలో ఒడిశా రాష్ట్రానికి చెందిన బిజయ భద్ర (21) డైలీ లేబర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే కన్వెయర్ బెల్ట్ కింద రాయి పడటంతో, దానిని తొలగించేందుకు బిజయ భద్ర వెళ్లాడు. అదే సమయంలో కన్వెయర్ బెల్ట్ అతని చేతికి తగిలి, తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

అయితే, మృతుడు బిజయ భద్రకు 10 రోజుల క్రితమే కుమార్తె జన్మించింది. తన నవజాత కుమార్తెను చూడకుండానే అతను ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులను, తోటి కార్మికులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ ఘటనపై స్పందించిన తోటి కార్మికులు పరిశ్రమలో తగిన మౌలిక వసతులు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే మృతదేహాన్ని వారి స్వగ్రామమైన ఒడిశాకు తరలించాలని పరిశ్రమ యాజమాన్యాన్ని కుటుంబ సభ్యులు కోరారు.

Next Story