పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఖలీఫా’ రిలీజ్ డేట్ ఫిక్స్

by Chukka Sudharani |

ఇతర భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్స్‌గా మెప్పిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్

పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఖలీఫా’ రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: ఇతర భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్స్‌గా మెప్పిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఖలీఫా’. వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ బంగారు స్మగ్లింగ్ కార్యకలాపాలు, ప్రతీకారం, అండ్ కుటుంబ వారసత్వం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ‘Vengeance will be written in Gold’ అనే ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ మూవీలో పృథ్వీరాజ్ ‘అమీర్ అలీ’ అనే పాత్రలో నటిస్తుండగా.. ప్రముఖ నటుడు మోహన్ లాల్ ఆయన తాత (మాంబరక్కల్ అహ్మద్ అలీ) పాత్రలో కనిపించనున్నారు. అలాగే టోవినో థామస్, నీల్ నితిన్ ముకేష్, మాళవిక వర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి పలు అప్డేట్స్ వచ్చి ఆకట్టుకోగా.. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ‘ఖలీఫా’ చిత్రం ఈ ఏడది ఆగస్టు 20న మలయాళంతో పాటు తెలుగు, తమిళంలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటిస్తూ ఓ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్.

Next Story