జూరాల డ్యామ్‌కు 30 వేల క్యూసెక్కుల వరద..

by Taduka Kalyani |

ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రియదర్శిని జూరాల (పీజేపీ) డ్యామ్‌కు సోమవారం రాత్రి 9 గంటల నాటికి 30 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.

జూరాల డ్యామ్‌కు 30 వేల క్యూసెక్కుల వరద..
X

దిశ, గద్వాల: ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రియదర్శిని జూరాల (పీజేపీ) డ్యామ్‌కు సోమవారం రాత్రి 9 గంటల నాటికి 30 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. అయితే స్పిల్‌వే గేట్లు ఎత్తాల్సిన అవసరం రాకపోవడంతో వాటిని మూసివేసినట్లు అధికారులు తెలిపారు. డ్యామ్‌లో ప్రస్తుతం 318.15 మీటర్లు (1,043.799 అడుగులు) నీటిమట్టం నమోదైంది. మొత్తం నీటి నిల్వ 8.909 టీఎంసీలు కాగా, లైవ్ స్టోరేజ్ 5.202 టీఎంసీలుగా ఉంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) 318.516 మీటర్లు కాగా, పూర్తి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. డ్యామ్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం 14 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 750 క్యూసెక్కులు, భీమా ఎత్తిపోతల మొదటి దశకు 1,300 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకానికి 315 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో మొత్తం నీటి విడుదల 16,408 క్యూసెక్కులకు చేరింది. స్పిల్‌వే గేట్లు, ఎడమ, కుడి ప్రధాన కాలువలు, ఆర్‌డీఎస్ లింక్ కాలువ, ప్యారలల్ కాలువల ద్వారా ప్రస్తుతం ఎలాంటి నీటి విడుదల లేదని అధికారులు వెల్లడించారు.

Next Story