- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అగ్రస్థానంలో తెలంగాణ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర విచారణలో శాస్త్రీయ ఆధారాల ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా నియమితులైన 57 మందికి డీజీపీ నియామక పత్రాలను అందజేశారు. ఫోరెన్సిక్ పరీక్షల వేగం మరింత పెరగడమే కాకుండా, పోలీసు దర్యాప్తుకు కీలకమైన ఆధారాలు సకాలంలో లభించనున్నాయి. ...

దిశ,తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర విచారణలో శాస్త్రీయ ఆధారాల ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా నియమితులైన 57 మందికి డీజీపీ నియామక పత్రాలను అందజేశారు. ఫోరెన్సిక్ పరీక్షల వేగం మరింత పెరగడమే కాకుండా, పోలీసు దర్యాప్తుకు కీలకమైన ఆధారాలు సకాలంలో లభించనున్నాయి. ఇందు లో 57 మందిలో 35 మంది పీహెచ్‌డీ పట్టా పొందిన వారు కాగా, 12 మంది ఎమ్మెస్సీ, ఐదుగురు ఎంటెక్, ముగ్గురు ఎంసీఏ పట్టభద్రులు ఉన్నారు. రాష్ట్ర డీజీపీ సీవీ అనంద్ తో పాటు హోం శాఖ ముఖ్య కార్యదర్శి, ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త సిబ్బందికి ల్యాబ్ పనితీరుపై దిశానిర్దేశం చేశారు.
న్యాయం జరగాలంటే ఫోరెన్సిక్ నివేదికలు సకాలంలో అందాలి..
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాల ప్రకారం ఫోరెన్సిక్ పాత్ర ఎంతో కీలకమని స్పష్టం చేశారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరగాలంటే ఫోరెన్సిక్ నివేదికలు సకాలంలో అందాలని, ఇందులో ఫోరెన్సిక్ పాత్ర కీలకమని గుర్తుచేశారు. ముఖ్యంగా సున్నితమైన, సంచలనం సృష్టించిన కేసుల్లో నివేదికలను నిర్ణీత గడువులోగా అందించాలని సూచించారు. ల్యాబ్‌లో అందుబాటులో ఉన్న అత్యాధునిక పరికరాలు, అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకుని వృత్తి నైపుణ్యాన్ని నిరంతరం పెంచుకోవాలని అన్నారు.తెలంగాణ ఎఫ్‌ఎస్‌ఎల్ ఇప్పటికే ఎన్ఏబీఎల్ గుర్తింపు పొంది, అత్యాధునిక మౌలిక వసతులతో కొనసాగుతోంది.పెరుగుతున్న డ్రగ్స్ కేసులు, సైబర్ నేరాలను ఛేదించేందుకు ల్యాబ్‌ను మరిన్ని అధునాతన హంగులతో తీర్చిదిద్దుతున్నామని, సిబ్బంది కొరత తీర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందని డీజీపీ హామీ ఇచ్చారు.
గత ఏడాది 18,647 కేసుల పరిష్కారం..
ఈ సందర్భంగా శిఖా గోయల్ మాట్లాడుతూ.. ఫోరెన్సిక్ విభాగంలో చేరడం వల్ల డీఎన్ఏ విశ్లేషణ, కంప్యూటర్ ఫోరెన్సిక్, నార్కోటిక్స్, టాక్సికాలజీ వంటి కీలక విభాగాల్లో పరిశోధనలు ఖచ్చితత్వంతో సాగనున్నాయని పరిమిత సిబ్బందితోనే గత ఏడాది 18,647 కేసులను పరిష్కరించి, 86 శాతం రికార్డు స్థాయి పరిష్కార రేటును సాధించామని ఆమె వెల్లడించారు. దేశంలోనే అత్యధిక కేసులు పరిష్కరిస్తున్న ల్యాబ్‌లలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని అమె వివారించారు.






