- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ-సిటీలో సీఎస్ సంజయ్ జాజు పర్యటన
ఈ-సిటీలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను, ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ, అవాంటెల్ లిమిటెడ్ పరిశ్రమ, మంఖాల్ పారిశ్రామిక పార్క్‌ను, ఎం/ఎస్. చిరిపాల్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్ పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సోమవారం ఉదయం సందర్శించారు...

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ-సిటీలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను, ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ, అవాంటెల్ లిమిటెడ్ పరిశ్రమ, మంఖాల్ పారిశ్రామిక పార్క్‌ను, ఎం/ఎస్. చిరిపాల్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్ పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సోమవారం ఉదయం సందర్శించారు. సీఎస్‌తోపాటు టీజీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శశాంకతోపాటు సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ముందుగా మెసర్స్ ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను సందర్శించారు.
‘‘ఈ-సిటీలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన ఈ సంస్థ సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీ చేస్తోంది. రూ.1,240 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమలో ప్రస్తుతం 1,200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అనంతరం ఎం/ఎస్.అవాంటెల్ లిమిటెడ్ పరిశ్రమను సందర్శించారు. 4 ఎకరాల విస్తీర్ణంలో ఈ-సిటీలో ఉన్న ఈ పరిశ్రమ హైటెక్ రక్షణ ఎలక్ట్రానిక్స్, శాటిలైట్ పేలోడ్ వ్యవస్థలు, గ్రౌండ్ స్టేషన్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రధానంగా చేపడుతోంది. రూ.59.22 కోట్ల పెట్టుబడితో ఉన్న ఈ సంస్థలో 400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.’’ అని తెలిపారు.
ఈ సందర్బంగా మంఖాల్ పారిశ్రామిక పార్క్‌ను, మెసర్స్ చిరిపాల్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్ పరిశ్రమను సందర్శించారు. ‘‘ఈ సంస్థకు ప్రారంభంలో 1,20,881 చదరపు మీటర్లు (29.87 ఎకరాలు) విస్తీర్ణం గల భూమి బీఓపీపీ/బీఓపీఈటీ ఫిల్మ్ తయారీ యూనిట్ స్థాపన కోసం కేటాయించారు. ఇందులో కోటింగ్, మెటలైజింగ్, స్లిట్టింగ్, రీసైక్లింగ్ ఉత్పత్తులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ యూనిట్ వాణిజ్య ఉత్పత్తి నిర్వహిస్తూ రూ.284.02 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉపాధి కల్పిస్తోంది. అనంతరం మెసర్స్ విప్రో ఎంటర్‌ప్రైజెస్ (ప్రైవేట్) లిమిటెడ్ పరిశ్రమను సందర్శించారు. ఈ సంస్థకు 1,21,410 చదరపు మీటర్లు (30 ఎకరాలు) విస్తీర్ణంలో భూమి కేటాయించారు. ప్రస్తుతం ఈ యూనిట్ రూ.17,434 లక్షల పెట్టుబడితో వాణిజ్య ఉత్పత్తి నిర్వహిస్తూ 331 మందికి ఉపాధి కల్పిస్తోంది.’’ అని పేర్కొన్నారు.
చివరిగా ఎం/ఎస్. మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను సంజయ్ జాజు సందర్శించారు. ‘‘ఈ సంస్థకు మహేశ్వరం జనరల్ పార్క్‌లోని మొత్తం 14,973 చదరపు మీటర్లు (3.7 ఎకరాలు) విస్తీర్ణంలో భూమి అత్యాధునిక రత్నాలు, ఆభరణాల తయారీ యూనిట్ స్థాపన కోసం కేటాయించారు. ఈ సంస్థకు కేటాయించిన స్థలంలో తయారీ యూనిట్‌ను విజయవంతంగా ఏర్పాటు చేసి విస్తరణ ప్రాజెక్టులను పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ యూనిట్ రూ.37,405 లక్షల పెట్టుబడితో వాణిజ్య ఉత్పత్తి నిర్వహిస్తూ 2,782 మందికి ఉపాధి కల్పిస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి మరింత వేగం తీసుకురావాలి.’’ అని అధికారులను సీఎస్ కోరారు.






