84 సర్వేనంబర్ అసైన్డ్ భూములకు రీ-సర్వే చేయాలి

by Batti.Sumithra |

మంచాల మండల పరిధిలోని తాళ్ళపల్లిగూడ గ్రామంలో గల సర్వేనెంబర్ 84లోని అసైన్డ్ భూములను సమగ్రంగా రీ-సర్వే చేయించాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ శాసనసభ్యుడు మల్‌రెడ్డి రంగారెడ్డిని గ్రామ సర్పంచ్ జోగు శంకరయ్య కోరారు.

84 సర్వేనంబర్ అసైన్డ్ భూములకు రీ-సర్వే చేయాలి
X

దిశ, మంచాల : మంచాల మండల పరిధిలోని తాళ్ళపల్లిగూడ గ్రామంలో గల సర్వేనెంబర్ 84లోని అసైన్డ్ భూములను సమగ్రంగా రీ-సర్వే చేయించాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ శాసనసభ్యుడు మల్‌రెడ్డి రంగారెడ్డిని గ్రామ సర్పంచ్ జోగు శంకరయ్య కోరారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సర్వే నెంబరు 84లో ఉన్న అసైన్డ్ భూముల పరిస్థితి క్షేత్రస్థాయిలో గందరగోళంగా ఉందన్నారు. రైతుల వద్ద ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలలోని విస్తీర్ణానికి, ప్రస్తుతం వారి ప్రత్యక్ష కబ్జాలో ఉన్న భూమికి పొంతన ఉండటం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

పట్టాలో ఒక రకంగా ఉంటే, క్షేత్రస్థాయిలో రైతుల స్వాధీనంలో మరోలా ఉందని వివరించారు. భూముల సరిహద్దుల వ్యత్యాసాల వల్ల రైతుల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో రీ-సర్వే నిర్వహించి, ప్రస్తుతం ఏ రైతు ఎంత భూమి కబ్జాలో ఉన్నారో దాని ప్రకారమే సరిచేసి కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీని పై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, సమస్యను సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామప్రజలు బోయిని నరసింహ, జంగయ్య, మల్లయ్య, మల్లేష్ పాల్గొన్నారు.

Next Story