హైడ్రా వ్యవహారంపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు: ఈటల రాజేందర్

by Taduka Kalyani |

హైడ్రా వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపపెట్టులాంటిదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.

హైడ్రా వ్యవహారంపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు: ఈటల రాజేందర్
X

దిశ, మల్కాజిగిరి : హైడ్రా వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపపెట్టులాంటిదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా ఏర్పాటుతో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు ఆక్రమణల నుంచి రక్షణ పొందుతాయని ప్రజలు ఆశించారని, కానీ భూమాఫియాపై చర్యలు తీసుకోకుండా పేదల ఇళ్లపైనే కూల్చివేతలు జరిగాయని ఆరోపించారు. హైడ్రా చర్యల కారణంగా అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, రియల్ ఎస్టేట్ రంగం కూడా తీవ్రంగా దెబ్బతిందని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు కాకుండా చట్టానికి లోబడి విధులు నిర్వహించాలని సూచించిన ఈటల రాజేందర్, హైకోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వం తన విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story