- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలికపై అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు
by Taduka Kalyani |
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లికార్జున్ నగర్‌లో నాలుగేళ్ల బాలికతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

X
దిశ, మల్కాజిగిరి: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లికార్జున్ నగర్‌లో నాలుగేళ్ల బాలికతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం, జూలై 26న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో నాలుగేళ్ల బాలిక ఒంటరిగా ఆడుకుంటుండగా, ఓ వ్యక్తి చాక్లెట్ ఇస్తానని పిలిచి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై బాలిక తల్లి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






