ఢిల్లీ నిరసనల్లో హత్య, పోక్సో నిందితులు.. 2,873 మంది క్రిమినల్స్‌ గుర్తింపు

by Kema Shiva Kumar |

జంతర్ మంతర్ ధర్నా ప్రదేశంలో హత్య, పోక్సో వంటి తీవ్ర నేర చరిత్ర కలిగిన వ్యక్తులు పాల్గొన్నట్లుగా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఢిల్లీ పోలీసులు గుర్తించారు.

ఢిల్లీ నిరసనల్లో హత్య, పోక్సో నిందితులు.. 2,873 మంది క్రిమినల్స్‌ గుర్తింపు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద ఇటీవల జరిగిన నిరసన ప్రదర్శనలకు సంబంధించిన దర్యాప్తులో ఢిల్లీ పోలీసులు (Delhi Police) సంచలన విషయాలను వెల్లడించారు. జూలై 20 నుంచి జూలై 25 మధ్య ధర్నా ప్రదేశం పరిసరాల్లో క్రిమినల్ రికార్డులు ఉన్న 2,873 మంది ఆకతాయిలు, నేరస్థులు సంచరించినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) కెమెరాలు, 100కు పైగా సీసీటీవీ ఫుటేజ్‌లు, సోషల్ మీడియా విశ్లేషణల ద్వారా మొత్తం 2,873 మంది నేరస్థులను పోలీసులు ట్రేస్ చేశారు.

తీవ్రమైన నేరాల్లో నిందితులు..

అయితే, గుర్తించిన నిందితుల్లో చాలామంది హత్య, హత్యాప్రయత్నం, దోపిడీ, అత్యాచారం, పోక్సో, ఆయుధాల చట్టం కింద కేసులు నమోదైన పాత నేరస్థులు ఉన్నట్లుగా పోలీసు వర్గాలు తెలిపాయి. జూలై 20న జంతర్ మంతర్, న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో ఈ నేరస్థుల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. తీవ్రమైన నేర చరిత్ర కలిగిన కొందరు వ్యక్తులు ఐదు రోజుల వ్యవధిలో పదే పదే నిరసన ప్రదేశానికి వచ్చి వెళ్లినట్లుగా ఎఫ్‌ఆర్‌ఎస్ డేటా ద్వారా బహిర్గతమైంది. ఢిల్లీ పోలీసులు ఆ డేటా ఆధారంగా వారిని అదుపులోకి తీసుకుని అచారించే అవకాశాలు ఉన్నాయి.

Next Story