ఎల్-నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి

by Taduka Kalyani |

ఎల్-నినో ప్రభావంతో ఏర్పడే తక్కువ వర్షపాతం, నీటి కొరత పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.

ఎల్-నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి
X

దిశ, వరంగల్ బ్యూరో : ఎల్-నినో ప్రభావంతో ఏర్పడే తక్కువ వర్షపాతం, నీటి కొరత పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కన్వర్జెన్స్ సమావేశంలో సమీక్షించారు. ఖరీఫ్ సీజన్‌లో రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటి పరిమాణం, సాగునీటి అవసరాలు, పంటల ప్రస్తుత పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ ముందస్తు ప్రణాళికతో పనిచేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, సాగునీటి, విద్యుత్, భూగర్భ జలాల శాఖలు పరస్పర సమన్వయంతో జిల్లా కాంటింజెన్సీ ప్లాన్‌ను రూపొందించాలని తెలిపారు. తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను రైతులకు సూచించడం, నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, అవసరమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమీక్ష లో వ అదనపు కలెక్టర్ రెవెన్యూ జి సంధ్యారాణి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్, డీఆర్వో జడ్పీ సీఈవో రాంరెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ రావు, ఎలక్ట్రిసిటీ ఎస్ ఈ ఆనందం, వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి శ్రీవల్లి, సంబధిత మండలాల క్షేత్ర స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Next Story