- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BS-VI వాహనదారులకు తీపికబురు: ‘పొల్యూషన్ సర్టిఫికెట్’ వ్యాలిడిటీ 3 ఏళ్లకు పెంపు?
BS-VI వాహనదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: వాహనదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఓ కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. బీఎస్-VI (BS-VI) నిబంధనలకు అనుగుణంగా ఉన్న సొంత వాహనాలకు ఇచ్చే ‘పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్’ (PUCC) చెల్లుబాటు కాలాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఏడాది గడువును ఏకంగా మూడేళ్లకు పొడిగించాలని తాజాగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో ప్రతిపాదించింది.
డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లోని అంశాలివే..
అయితే, ఆరేళ్ల లోపు వ్యాలిడిటీ BS-VI సొంత వాహనాలకు పొల్యుషన్ సర్టిఫికెట్ (PUCC) చెల్లుబాటు గడువును ప్రస్తుత ఏడాది నుంచి మూడేళ్లకు పెంచాలని ప్రతిపాదించారు. అదేవిధంగా ఆరేళ్ల నుంచి పదేళ్ల వ్యాలిడిటీ ఉన్న బీఎస్-4 వాహనాలు ప్రతి ఏటా పీయుసీసీ సర్టిఫికెట్‌ను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఇక పదేళ్లు దాటిన బీఎస్-IV వాహనాలకు ప్రతి 6 నెలలకోసారి పీయుసీసీ సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి కానుంది. బీఎస్-IV నిబంధనలు పాటించే అన్ని మోటారు వాహనాలు ప్రతి 6 నెలలకు ఒకసారి పొల్యూషన్ సర్టిఫికెట్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. చివరగా పాత మోడళ్లు అయిన బీఎస్-I, బీఎస్-II, బీఎస్-III ప్రమాణాలు కలిగిన వాహనాలు ప్రతి 3 నెలలకొకసారి తప్పనిసరిగా పొల్యుషన్ సర్టిఫికెట్ తీసుకునే నిబంధంనలు సవరించనున్నారు. పర్యావరణానికి తక్కువ హాని కలిగించే బీఎస్-VI వాహనదారులపై ఆర్థిక, సమయ భారాలను తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను ప్రతిపాదించింది.






