వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు సాగు చేయాలి: మండల వ్యవసాయ అధికారి

by Kodari Anjali |

సోమవారం చివ్వెంల మండల కేంద్రంలోని రైతు వేదికలో విత్తన మేళాను నిర్వహించారు.

వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు సాగు చేయాలి: మండల వ్యవసాయ అధికారి
X

దిశ, చివ్వేంల: సోమవారం చివ్వెంల మండల కేంద్రంలోని రైతు వేదికలో విత్తన మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు, నానో యూరియా, నానో డి.ఎ.పి అందుబాటులో ఉంచి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి డి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, ఆరుతడి పంటలైన పెసర, కంది, మినుము, జొన్నలుతో పాటు కూరగాయల పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక చేసుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. రైతులకు అవసరమైన పెసర, కంది, మినుము, కూరగాయల విత్తనాలు ఈ నెల 27, 28, 29 తేదీలలో మూడు రోజుల పాటు చివ్వెంల రైతు వేదికలో అందుబాటులో ఉంటాయని, ఆసక్తి గల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగయ్య, తహసీల్దార్ చంద్రశేఖర్, మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, ఉద్యాన శాఖ అధికారి స్వాతి, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీశైలం, శైలజ, మానస, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓ శ్రీనివాస్, రైతులు రవీందర్,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Next Story