సమాచారమే శక్తి.. పారదర్శకతే ప్రజాస్వామ్యానికి పునాది

by Batti.Sumithra |

సమాచారమే శక్తి.. పారదర్శకతే ప్రజాస్వామ్యానికి పునాది అని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్ అన్నారు.

సమాచారమే శక్తి.. పారదర్శకతే ప్రజాస్వామ్యానికి పునాది
X

దిశ, హిమాయత్‌నగర్ : సమాచారమే శక్తి.. పారదర్శకతే ప్రజాస్వామ్యానికి పునాది అని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్ అన్నారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి ఆధ్వర్యంలో జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఏకగ్రీవ నిర్ణయంతో తోట శ్రీనివాస్‌ను జాతీయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకుని నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సమాచార హక్కు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడంలో తోట శ్రీనివాస్ సేవలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అలాగే సంస్థ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన నిబద్ధతతో పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, జాతీయ సహాయ కార్యదర్శి అన్నవరం సందీప్ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చింతల రాఘవేందర్, రాష్ట్ర కో-కన్వీనర్ గడప కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాష్ పటేల్, అరవింద్ స్వామి, రాష్ట్ర కార్యదర్శులు రావుల నవీన్ కుమార్, కేడెల ప్రసాద్, మడుపు వేణుగోపాల్ రావు, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఏ. శ్రీకాంత్ రెడ్డి, శివకుమార్ గౌడ్, అశోక్ కుమార్, జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Next Story