అహోబిలం వివాదం.. అఖిలప్రియకు అధిష్టానం పిలుపు

by Vemula.Srinu Prasad |

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు అధిష్టానం పిలుపునిచ్చింది. నంద్యాల జిల్లాలోని అహోబిలం వివాదంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది... ..

అహోబిలం వివాదం.. అఖిలప్రియకు అధిష్టానం పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ(Allagadda MLA Bhuma Akhila Priya)కు అధిష్టానం పిలుపునిచ్చింది. నంద్యాల జిల్లా(Nandyala District)లోని అహోబిలం వివాదం(Ahobilam Issue)పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మంగళవారం పార్టీ ఆఫీసులకు రావాలని సూచించింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(Telugu Desam Party President Palla Srinivasa Rao)ను కలవాలని అధిష్టానం తెలిపింది. కాగా నంద్యాల అహోబిలం తలనీళాల వ్యవహారంలో భూమా అఖిలప్రియ అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తలనీళాల తరలింపును అఖిలప్రియ సోదరుడు విఖ్యాత్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడిచింది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ సీరియస్ అయింది. భూమా అఖిల ప్రియ నుంచి వివరణ తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆమెకు పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.

Next Story