దేశ రాజకీయాల్లో సంచలనం.. గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-02 04:46:50  IST  )

దేశ రాజకీయాల్లో సంచలన చోటుచేసుకుంది.

దేశ రాజకీయాల్లో సంచలనం.. గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. కర్ణాటకలోని బళ్ళారి (Bellary)లో ఇవాళ ఉదయం కాల్పులు కలకలం రేపాయి. ఎమ్మెల్యే భరత్ రెడ్డి (MLA Bharath Reddy)) సన్నిహితుడు సతీష్ రెడ్డి గన్‌మెన్ వద్ద గన్ లాక్కుని గంగావతి ఎమ్మెల్యే, అపర కుబేరుడు గాలి జనార్ధన్ రెడ్డి (Gali Janardhan Reddy)పై కాల్పులకు తెగబడ్డాడు. మొత్తం 8 రౌండ్ల పాటు కాల్పులు జరపగా.. జనార్ధన్ రెడ్డి తృటిలో తప్పించుకున్నారు. ఇరు వర్గాల పరస్పర కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. ఇక కాల్పులు జరిపిన సతీష్ రెడ్డికి కూడా గాయాలు అయ్యాయి. దీంతో అతడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు.

ఫ్లెక్సీల తొలగింపుతో ఇరు వర్గాల ఘర్షణ..

కాగా, మహర్షి వాల్మీకి (Maharshi Vaalmiki) విగ్రహ ఏర్పాటు సందర్భంగా ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులు ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి సమీపంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు పెట్టారు. అయితే, అక్కడే ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి అనుచరులు ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టొద్దని తొలగించారు. మరోచోట పెట్టుకోండని ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులతో వాగ్వాదానికి దిగారు. ఇక్కడే వివాదం మొదలై బళ్ళారి నగరంలో గురువారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గన్‌మెన్ వద్ద ఉన్న గన్ లాక్కొని ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు వచ్చిన ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డిపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో రాజశేఖర్ అనే యువకుడు మృతి చెందగా ప్రశాంతంగా ఉన్న నగరంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. అనంతరం ఇరువర్గాల కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేసి అందరిని చెదరగొట్టారు. ఇక ఇరు వర్గాల ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకోవడంతో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరోసారి రెండు వర్గాల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది. రాళ్లు, బీరు సీసాలు కూడా విసురుకున్నారు. దీంతో పోలీసుల ఎస్పీ ఆదేశాలతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపగా పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Read More..

దుర్గం చెరువు సమీపంలో భూ కబ్జా.. ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు


Next Story