- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుర్గం చెరువు సమీపంలో భూ కబ్జా.. ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు
నగరంలోని ప్రధాన పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువు ఆక్రమణల వ్యవహారంలో బీఆర్ఎస్ మాజీ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని ప్రధాన పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువు (Durgam Cheruvu) ఆక్రమణల వ్యవహారంలో బీఆర్ఎస్ మాజీ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy)కి బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు చెరువు భూమిని కబ్జా చేసి అక్రమంగా దందాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) ఇచ్చిన ఫిర్యాదుతో తాజాగా మాదాపూర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. దుర్గం చెరువు పరివాహక ప్రాంతంలోని సుమారు 5 ఎకరాల శిఖం భూమిని ప్రభాకర్ రెడ్డి అనుచరులు మట్టి, రాళ్లతో నింపి చదును చేశారు. అనంతరం ఆ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తుల ద్వారా ప్రైవేట్ బస్సులు, ఐటీ కంపెనీల వాహనాలకు పార్కింగ్ లాట్ నిర్వహిస్తూ నెలకు సుమారు రూ.50 లక్షల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లుగా హైడ్రా పాథమిక విచారణలో వెల్లడైంది.
దుర్గం చెరువు ఆక్రమణలు 2014 నుంచే మొదలైనట్లుగా హైడ్రా అధికారులు ఆరోపిస్తున్నారు. 10 నుంచి 15 మీటర్ల మేర లోతుగా మట్టిని నింపి అక్రమంగా స్థలాన్ని సృష్టించారని అధికారులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు మరో వ్యక్తి వెంకట్ రెడ్డి (Venkat Reddy)పై BNS యాక్ట్ సెక్షన్ 329(3), 3(5)తో పాటు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద మాదాపూర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. కాగా, ప్రభాకర్ రెడ్డి ఆక్రమించిన భూమిలో పార్క్ చేసిన ఉన్న వాహనాలను హైడ్రా ఖాళీ చేయించింది. చెరువు సరిహద్దులను పునరుద్ధరించేందుకు అక్కడ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయబోతున్నారు.
Read More..
సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. మూడు కార్పొరేషన్లు-ఒకే సెటప్!






