రాష్ట్రంలోని మహిళలకు నెలకు రూ.1000.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-14 10:14:20  IST  )

సీఎం విజయ్ మే 2026 నెలకు సంబంధించిన కలైంజ్ఞర్ మహిళా హక్కుల పథకం నిధులను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని మహిళలకు నెలకు రూ.1000.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళలకు తమిళనాడు సర్కార్ (Tamilnadu Goverment) తీపి కబురు అందించింది. మే 2026 నెలకు సంబంధించిన ‘కలైంజ్ఞర్ మహిళా హక్కుల గుర్తింపు పథకం’ (Kalaignar Women’s Entitlement Scheme) నిధులను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయాలని సీఎం విజయ్ అధికారులను ఆదేశించారు. అయితే, ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.1,000 ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది. మే నెలకు సంబంధించిన ఈ మొత్తాన్ని జాప్యం లేకుండా త్వరలోనే లబ్ధిదారుల ఖాతాల్లో క్రెడిట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలైంజ్ఞర్ మహిళా హక్కుల పథకాన్ని మరింత మెరుగుపరిచేందుకు, పునర్వ్యవస్థీకరించేందుకు (Restructuring) కొంత సమయం కావాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా మహిళలకు అందాల్సిన నెలవారీ సాయం సక్రమంగా అందేలా సీఎం విజయ్ చర్యలు తీసుకున్నారు.

TN: ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు గుడ్ న్యూస్.. 2 శాతం డీఏ పెంపుపై సీఎం సంచలన నిర్ణయం

Next Story