TN: ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు గుడ్ న్యూస్.. 2 శాతం డీఏ పెంపుపై సీఎం సంచలన నిర్ణయం

by Prasad Jukanti |   (  Updated:2026-05-14 10:15:12  IST  )

తమిళనాడు సీఎం విజయ్ ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంచుతూ ప్రకటన చేసింది. అలాగే త్వరలో మహిళల ఖాతాల్లో రూ.1000 జమ చేస్తామని వెల్లడించారు.

TN: ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు గుడ్ న్యూస్.. 2 శాతం డీఏ పెంపుపై సీఎం సంచలన నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులో కొత్తగా కొలువుదీరిన విజయ్ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గిన ఉత్సాహం కనపరుస్తోంది. బుధవారం అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో బంపర్ మెజారిటీ సాధించిన విజయ్ సర్కార్ అదే ఉత్సాహంతో సంచలన ప్రకటనలు చేసింది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 2 శాతం డీఏ (Dearness Allowance) పెంచుతూ ముఖ్యమంత్రి విజయ్ ప్రకటన చేశారు. ఈ మేరకు సీఎంవో గురువారం అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రకటన చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 58 శాతంగా ఉన్న కరువు భత్యాన్ని 60 శాతానికి పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ఈ డీఏ జనవరి 1, 2026 నుండి వర్తిస్తుందని అధికారిక ప్రకటనలో వెల్లడించారు. తాజా పెంపుతో రాష్ట్ర ఖజానాపై ఏడాదికి అదనంగా రూ.1,230 కోట్ల ఆర్థిక భారం పడనుంది. అయినప్పటికీ, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.

త్వరలో మహిళలకు నెలకు రూ.వెయ్యి

త్వరలో కలైంగర్ ఉరిమయ్ తోగాయ్ పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ. 1000 వారి అకౌంట్‍లో జమ చేస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మే నెలకు సంబంధించిన డబ్బులు అతి త్వరలోనే లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామని పేర్కొంది. గత డీఎంకే ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకానికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని పేర్కొంది. అయితే ఈ పథకాన్ని పునర్వవ్యస్థీకరించేందుకు తమ ప్రభుత్వానికి కొంత సమయం కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా మొన్నటి ఎన్నికల ప్రచార హామీలో భాగంగా రాష్ట్రంలోని 60 ఏళ్లలోపు ఉన్న పేద, అర్హులైన మహిళలకు ప్రతి నెల రూ. 2,500 ఇస్తామని టీవీకే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలోని మహిళలకు నెలకు రూ.1000.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

Next Story